LOADING...
Vinesh Phogat: ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్
ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్

Vinesh Phogat: ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు దిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. అభిమానుల ప్రేమను చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఇచ్చిన మాటను వినేశ్ సొంత ఊరు బలాలి గ్రామ పెద్దలు నిలబెట్టుకున్నారు. మాటిచ్చిన ప్రకారం ఆమెకు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో వంద గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల ఆమె అనర్హతకు గురైన విషయం తెలిసిందే.

Details

వినేశ్ కు స్వర్ణ పతకం బహూకరణ

పారిస్ ఒలింపిక్స్‌లో వంద గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల ఆమె అనర్హతకు గురైన విషయం తెలిసిందే. బలాలిలో ఆమె మేనమామ మాహవీర్ ఫోగాట్, ఖాప్ పంచాయతీ పెద్దలు వినేశ్ కు గౌరవ మర్యాదలతో సత్కరించారు. 'ఒలింపిక్ మెడల్ గెలవకున్నా సరే.. నువ్వు ఎప్పటికీ ఛాంపియన్‌వే' అంటూ ఆమెను ఘనంగా సన్మానించారు. పూలదండలు, తలపాగాతో సన్మానించిన అనంతరం వినేశ్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.