LOADING...
BCCI: హర్మన్‌ప్రీత్‌ సేనకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ విజయం సాధిస్తే భారీ బొనాంజా! 
హర్మన్‌ప్రీత్‌ సేనకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ విజయం సాధిస్తే భారీ బొనాంజా!

BCCI: హర్మన్‌ప్రీత్‌ సేనకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ విజయం సాధిస్తే భారీ బొనాంజా! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Women's World Cup 2025) చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబయి వేదికగా జరగనున్న ఫైనల్‌లో భారత్‌ (IND-W) మరియు దక్షిణాఫ్రికా (SA-W) జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా టైటిల్‌ సాధించలేకపోవడంతో, ఈ సారి క్రికెట్ ప్రపంచం కొత్త ఛాంపియన్‌ను చూడబోతోంది. ఇప్పటివరకు భారత్‌ 2005, 2017లో ఫైనల్‌కి చేరినా విశ్వవిజేతగా నిలవలేకపోయింది. ఇప్పుడు మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్ సేన సిద్ధమవుతోంది. సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాపై విజయంతో ఊపుమీదున్న భారత జట్టు, తుది పోరులోనూ అదే జోరును కొనసాగించి కప్‌ను తమ సొంతం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది.

Details

రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ

అభిమానులూ కూడా ఈ సారి భారత్‌ కప్‌ను ఎగరేసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక, మహిళల జట్టు విజయం సాధిస్తే వారికి భారీ బహుమతి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యోచిస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు పురుషుల జట్టుకు బీసీసీఐ మొత్తం రూ.125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో, మహిళల జట్టు ప్రపంచకప్‌ గెలిస్తే కూడా అదే స్థాయిలో బొనాంజా ప్రకటించే ఆలోచనలో ఉందని సమాచారం. "పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు చెల్లించే విధానాన్ని బీసీసీఐ ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. కాబట్టి మహిళల జట్టు ప్రపంచకప్‌ గెలిస్తే పురుషుల జట్టుకు ఇచ్చినంత మొత్తంలో బహుమతి ఇవ్వడం పట్ల చర్చలు జరుగుతున్నాయి.

Details

అధికారిక ప్రకటన చేయకూడదని నిర్ణయం

అయితే, భారత్‌ విజయం సాధించే వరకు అధికారిక ప్రకటన చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ వర్గాలు పీటీఐకి వెల్లడించాయి. గతంలో 2017 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ సమయంలో ప్రతి ఆటగాడికి బీసీసీఐ రూ.50 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందించింది. అదే విధంగా, 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి 17 ఏళ్ల తర్వాత కప్‌ను గెలుచుకుంది. ఆ మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు అంతర్జాతీయ టీ20 కెరీర్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు.