Page Loader
chennai: ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!
ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!

chennai: ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్ మ్యాచ్‌ వీక్షకుల కోసం చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ శనివారం చైన్నై సూపర్‌ కింగ్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లను తిలకించేందుకు టిక్కెట్టు ఉన్న క్రికెట్ అభిమానులు తమ నివాస ప్రాంతానికి సమీపంలోని మెట్రో స్టేషన్‌ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్‌ వరకు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రత్యేక సదుపాయం మ్యాచ్‌ జరుగుతున్న రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత 90 నిమిషాలు లేదా అర్థరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు కొనసాగుతాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ఆ రోజు చివరి రైలు బయలుదేరే సమయాన్ని ప్రకటిస్తారు.

Details

ఎంటీసీలో ప్రత్యేక సేవలు 

చెన్నై చేపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ)తో సీఎస్‌కే భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ వెల్లడించారు. క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ ప్రారంభానికి 3 గంటల ముందు నుంచి నాన్‌ ఏసీ ఎంటీసీ బస్సుల్లో తమ క్రికెట్ మ్యాచ్‌ టిక్కెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. గతేడాది ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి 8 వేల మంది వరకు ఎంటీసీ బస్సుల సేవలను వినియోగించుకున్నారు.

Details

ఐపీఎల్‌ 2025 - సీఎస్‌కే హోమ్‌ మ్యాచ్‌లు 

మార్చి 23: సీఎస్‌కే vs ముంబయి ఇండియన్స్‌ (రాత్రి 7:30) మార్చి 28: సీఎస్‌కే vs ఆర్సీబీ (రాత్రి 7:30) ఏప్రిల్‌ 5: సీఎస్‌కే vs డీసీ (మధ్యాహ్నం 3:30) ఏప్రిల్‌ 11: సీఎస్‌కే vs కేకేఆర్‌ (రాత్రి 7:30) ఏప్రిల్‌ 25: సీఎస్‌కే vs ఎస్‌ఆర్‌హెచ్‌ (రాత్రి 7:30) ఏప్రిల్‌ 30: సీఎస్‌కే vs పీబీకేఎస్‌ (రాత్రి 7:30) మే 12: సీఎస్‌కే vs ఆర్‌ఆర్‌ (రాత్రి 7:30) ఈ తేదీల్లో క్రికెట్ అభిమానులు మెట్రో రైలు, ఎంటీసీ బస్సుల సేవలను వినియోగించుకోవచ్చు.