సన్ రైజర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరులు వచ్చేశారు
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఎస్ఆర్‌హెచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే సన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. సన్ రైజర్స్ కెప్టెన్ ఐడైన్ మార్ర్కమ్, హెన్రిచ్ క్లాసన్, మార్కో జాన్‌సెన్ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు. నెదర్లాండ్స్ వన్డే సిరీస్ లో భాగంగా వారు మొదటి మ్యాచ్ దూరమయ్యారు. ప్రస్తుతం ఈ ముగ్గరు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు జట్టులోకి చేరితే ఆరెంజ్ ఆర్మ విజయాల పరంపరను కొనసాగిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సన్ రైజర్స్ జట్టులో చేరనున్న మార్ర్కమ్
నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మార్ర్కమ్ విజృంభించిన విషయం తెలిసిందే. 126 బంతుల్లో 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా మార్ర్కమ్ నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు వీరితో పాటు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్(లక్నో సూపర్ జెయింట్స్), మిల్లర్(గుజరాత్ టైటాన్స్), రబాడ(పంజాబ్ కింగ్స్), నోర్జే(ఢిల్లీ) ఆ జట్టులో చేరనున్నారు. ఈ స్టార్ ఆటగాళ్ల రాకతో ఆయా ఫ్రాంచేజీలు పటిష్టంగా మారనున్నాయి.