LOADING...
Nitish Kumar Reddy: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై?.. క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!
ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై?.. క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!

Nitish Kumar Reddy: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై?.. క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టును వీడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల అతడు SRH ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పనున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నితీశ్ స్పందిస్తూ పుకార్లపై స్పష్టత ఇచ్చాడు. అయితే కొన్ని సందర్భాల్లో నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించాడు. SRHతో తన బంధం నమ్మకంతో, గౌరవంతో కూడుకున్నదని పేర్కొన్నాడు. 'నేను ఎప్పుడూ జట్టుతోనే ఉంటానని తేల్చిచెప్పాడు. ఈ మేరకు ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

Details

అన్ని రూమర్స్ మాత్రమే

నితీశ్‌ను జట్టు తక్కువ క్ర‌మంలో బ్యాటింగ్‌కు పంపుతుండటంపై అతడిలో అసంతృప్తి ఉందని, అందుకే SRHను వీడతాడన్న రూమర్స్ వెలుగుచూశాయి. మరోవైపు పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టును వదిలి నితీశ్ 2026లో కొత్త ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకునే యోచనలో ఉన్నాడన్న వార్తలు కూడా వారం రోజులుగా గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ నితీశ్ వాటన్నింటినీ తిప్పికొట్టాడు. 'ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అవన్నీ రూమర్సే. నేను ఫ్రాంచైజీకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశాడు.