Page Loader
అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై
స్కాట్లాండ్‌లో తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోయెట్జర్

అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2023
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కాట్లాండ్ మాజీ కెప్టెన్ కైల్ కోయెట్జర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోయెట్జర్ కెప్టెన్సీలో స్కాట్లాండ్ పలు సంచలన విజయాలు సాధించింది. ముఖ్యంగా 2018లో అప్పటి ప్రపంచ కప్ నెంబర్ వన్ ఇంగ్లండ్‌ జట్టుకు స్కాట్లాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్లలో స్కాట్లాండ్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోయెట్జర్ కు పేరుంది. కోయెట్జర్ ఆగస్టు 2008లో ఐర్లాండ్‌తో జరిగిన T20Iలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తుండటంతో అతనికి స్కాట్లాండ్ కెప్టెన్సీని పదివి లభించింది. 2022లో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తాజాగా వన్డేల నుంచి కూడా కోయెట్జర్ రిటైర్మెంట్ ప్రకటించారు.

కోయెట్జర్

కోయెట్జర్ సాధించిన రికార్డులివే..

ఇలాంటి నిర్ణయం తీసుకొనే సమయం దగ్గర పడిందని, కెప్టెన్ గా నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పగా ఉందని కోయెట్జర్ పేర్కొన్నారు. 89 మ్యాచ్‌లలో 38.92 సగటుతో 3,192 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో కోయెట్జర్ స్కాట్లాండ్‌ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో ఐదు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలను బాదాడు. కోయెట్జర్ 70 టీ20ల్లో 1,495 పరుగులు చేశాడు. ఇందులో అరు అర్ధ సెంచరీలు ఉన్నారు. కోయెట్జర్ కెప్టెన్‌గా 86 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 46 విజయాలను నమోదు చేశాడు. ఇక 2015 వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై కోయెట్జర్‌ ఆడిన 156 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పొచ్చు.