తదుపరి వార్తా కథనం

శ్రీలంకపై భారత్ ఘన విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 12, 2023
11:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత జట్టు మరో విజయం సాధించింది. నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ లో 214 రన్స్ మాత్రమే చేసిన భారత్, కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో లంక 171 పరుగులకే అలౌటైంది.
ఒకానొక దశలో ధనుంజయ డిసిల్వా(41), దునిల్ వెల్లలాగే(42*) పోరాటంతో శ్రీలంకకు గెలుపు ఆశలు చిగురించాయి.
అయితే దనుంజయ డి సిల్వా రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఔట్ కావడంతో శ్రీలంక పోరాటం ముగిసింది.
భారత బౌలర్లలో కుల్దీప్ 4, జడేజా 2, సిరాజ్, హార్ధిక్ తలా ఓ వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
41 పరుగుల తేడాతో టీమిండియా విజయం
ASIA CUP 2023. WICKET! 41.3: Matheesha Pathirana 0(2) b Kuldeep Yadav, Sri Lanka 172 all out https://t.co/P0ylBAiETu #INDvSL
— BCCI (@BCCI) September 12, 2023