ENG vs SA: ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది.
ఈ మ్యాచులో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది.
ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా 29.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (72*), క్లాసిన్ 64 పరుగులతో రాణించడంతో ఆ జట్టు సునాయాసంగా విజయం సాధించింది.
చివర్లో డేవిడ్ మిల్లర్ సిక్సర్ కొట్టి ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు.
Details
చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు
ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్‌కు వెళ్లారు
.ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో అత్యధికంగా జో రూట్ 37 పరుగులు చేశాడు.
ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 25, బెన్ డకెట్ 24, జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 పరుగులు చేశారు.
మార్కో జాన్సన్, వియాన్ మల్డర్ చెరో 3 వికెట్లు తీసి, ఆ జట్టును దెబ్బతీశారు.
ఇంగ్లండ్ జట్టు ఒక్క విజయం లేకుండానే ఈ టోర్నీని నుంచి నిష్క్రమించింది