Page Loader
IPL 2023: రాణించిన గుజరాత్ బ్యాటర్లు .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
45 పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్

IPL 2023: రాణించిన గుజరాత్ బ్యాటర్లు .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2023
09:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ మొదటి ఓవర్లోనే వృద్దిమాన్ సాహా వికెట్(4)‌ను కోల్పోయింది. తర్వాత శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ (20) రనౌట్ కావడంతో 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ధాటిగా అడుతున్న కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (28) యుజేంద్ర చాహల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శుభ్ మాన్ గిల్ 45 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం గిల్‌ని సందీప్ శర్మ పెవిలియానికి పంపాడు.

రాజస్థాన్

రాణించిన రాజస్థాన్ బౌలర్లు

చివర్లో డేవిడ్ మిల్లర్, అభివన్ మనోహర్ మెరుపులు మెరిపించడంతో గుజరాత్ టైటాన్స్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. అభివన్ మనోహర్ 13 బంతుల్లో (3 సిక్సర్లు) 27 పరుగులు, డేవిడ్ మిల్లర్ 29 బంతుల్లో 46 పరుగులు చేసి విజృంభించాడు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ2, టెంట్ బౌల్ట్, అడమ్ జంపా, యుజేంద్ర చాహల్ తలా ఓ వికెట్ తీశారు.