LOADING...
RR vs GT: గుజరాత్ ఘన విజయం..రాజస్థాన్ను చిత్తుచేసిన గిల్ సేన
గుజరాత్ ఘన విజయం..రాజస్థాన్ను చిత్తుచేసిన గిల్ సేన

RR vs GT: గుజరాత్ ఘన విజయం..రాజస్థాన్ను చిత్తుచేసిన గిల్ సేన

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
11:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి రాజస్థాన్ ముందు ఉంచి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది. గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, హోల్డర్ 3 వికెట్లు, రబాడా 2 వికెట్లు సాధించారు. సిరాజ్ కూడా ఒక ముఖ్యమైన వికెట్ తీశాడు. చివరికి లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు 152 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని ఎదుర్కొంది.

వివరాలు

ప్రారంభం నుంచే రాజస్థాన్‌కు అడ్డంకులు..

230 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రాజస్థాన్ ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. హోమ్ గ్రౌండ్‌లో 'పింక్ ప్రామిస్'లో భాగంగా అద్భుతం చేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోవడంతో మరో పరాజయం తప్పలేదు. రాజస్థాన్ బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా 38 పరుగులు (25 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు), వైభవ్ సూర్యవంశీ 36 పరుగులు (16 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సులు), ధృవ్ జురెల్ 24 పరుగులు (10 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సులు) చేసి కొంత రాణించినప్పటికీ, భారీ స్కోరు చేయడంలో ఎవ్వరూ విజయం సాధించలేదు. పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి చవిచూసింది.

వివరాలు

చెలరేగిన ఓపెనర్లు..

ఇక అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా చెలరేగారు. ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం ద్వారా జట్టు బలమైన స్కోరు దిశగా వెళ్లింది. వారి భాగస్వామ్యంతో రాజస్థాన్ ముందు 230 పరుగుల లక్ష్యం నిలిచింది. గుజరాత్ ఓపెనర్లలో శుభ్‌మన్ గిల్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 84 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. 17వ ఓవర్‌లో బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి గిల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Advertisement

వివరాలు

జట్టును గెలిపించిన గిల్..

గిల్ తర్వాత వచ్చిన హోల్డర్ (7 పరుగులు) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 19వ ఓవర్‌లో బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్లో రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి స్కోరును మరింత పెంచారు. సుందర్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేయగా, తెవాటియా 4 బంతుల్లో 2 సిక్సులతో 14 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా, యశ్ రాజ్ పుంజా ఒక్కో వికెట్ సాధించారు. 19వ ఓవర్‌లో బ్రిజేష్ హోల్డర్‌ను ఔట్ చేయడంతో పాటు 3 డాట్ బాల్స్ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Advertisement