
WPL 2025: వారియర్స్‌పై గుజరాత్ విజయం.. రాణించిన ప్రియా మిశ్రా, డాటిన్
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్‌లో మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తమ తొలి విజయాన్ని సాధించింది.
UP వారియర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి విజయం నమోదు చేసింది.
యూపీ వారియర్స్ గుజరాత్ జెయింట్స్‌కు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, గుజరాత్ జెయింట్స్ 12 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
18 ఓవర్లలో 144/4 స్కోరుతో విజయం సాధించిన గుజరాత్, వడోదరలోని కోటంబి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది.
వివరాలు
మెరుగైన ప్రదర్శన చేసి..
ఇది గుజరాత్ జెయింట్స్‌కి రెండో మ్యాచ్‌లో వచ్చిన తొలి విజయం. ఫిబ్రవరి 14న బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
లక్ష్య ఛేదనలో గుజరాత్ జెయింట్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. స్టార్ బ్యాటర్లు బెత్ మూనీ, దయాళన్ హేమలత డకౌట్ అయ్యారు.
అయితే, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేసి గుజరాత్ ను గెలిపించారు.
వివరాలు
కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ మెరుపు ఇన్నింగ్స్
కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. లారా వోల్వార్డ్ 22 పరుగులు చేసింది.
హర్లీన్ డియోల్ (34 నాటౌట్) మరియు డిఆండ్రా డాటిన్ (33 నాటౌట్) ఐదో వికెట్‌కు 58 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
యూపీ వారియర్స్ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ 2 వికెట్లు తీయగా, గ్రేస్ హారిస్, తహిలా మెక్‌గ్రాత్ చెరో వికెట్ తీసుకున్నారు.
యూపీ వారియర్స్ బ్యాటింగ్ ఫెర్ఫార్మెన్స్
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
ఎక్కువ మంది బ్యాటర్లు మంచి శురువునిచ్చినా, పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు.
వివరాలు
గుజరాత్ బౌలింగ్ ప్రదర్శన
గుజరాత్ జెయింట్స్ బౌలింగ్‌లో ప్రియా మిశ్రా 3 వికెట్లు తీసి అదరగొట్టింది. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్, డిఆండ్రా డాటిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
కాశ్వి గౌతమ్ 1 వికెట్ తీసి మంచి మద్దతు అందించింది. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ టోర్నమెంట్‌లో తమ ఖాతాను తెరిచింది. యూపీ వారియర్స్‌కు ఇది తొలి ఓటమిగా నమోదైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆష్లీ అదరహో
Superb with the ball 👌
— Women's Premier League (WPL) (@wplt20) February 16, 2025
Clinical with the bat 💪@Giant_Cricket are off the mark in #TATAWPL 2025 with a 6⃣-wicket victory! 🥳
This is also their first successful chase ever in the history of the tournament. 🙌
Scorecard ▶ https://t.co/KpTdz5nl8D#GGvUPW pic.twitter.com/nLSQNYxQO6