IPL 2023: రాణించిన గుజరాత్ బౌలర్లు.. ఢిల్లీ స్కోరు ఎంతంటే
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కి శుభారంభం అందలేదు. ఓపెనర్ పృథ్వీషా (7), మిచెల్ మార్ష్ (4) పరుగులకే వెనుతిరిగారు. దీంతో బ్యాటింగ్ భారమంతా డేవిడ్ వార్నర్ మీదే పడింది. 32 బంతుల్లో 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రూసో డకౌట్‌తో నిరాశపరిచాడు. దీంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది.
గుజరాత్
చెలరేగిన గుజరాత్ బౌలర్లు
అల్జారీ జోసెఫ్ ఎనిమిదో ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు పడగట్టి విజృంభించాడు. అనంతరం సర్ఫరాజ్ ఖాన్, అభిషేక్ పోరెల్ ఢిల్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 30, అభిషేక్ పోరెల్ 20 పరుగులతో రాణించారు.
వీరిద్దరూ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియానికి చేరారు. చివర్లో బ్యాటింగ్ దిగిన అక్షర్ పటేల్ మెరపులు మెరిపించడంలో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. 22 బంతుల్లో ( 2 ఫోర్లు, 3 సిక్సర్లు) 36 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 162 పరుగులు చేసింది.
గుజరాత్ బౌలర్లలో రషీద్ 3 వికెట్లు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు, మహ్మద్ షమీ రెండు వికెట్లతో రాణించాడు.