
Kagiso Rabada: డ్రగ్స్ తీసుకొని దొరికిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్!
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్‌లో పట్టుబడిన రబాడపై క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక నిషేధం విధించింది.
ఈ విషయాన్ని రబాడ స్వయంగా శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించాడు. వినోదం కోసం నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న విషయాన్ని అంగీకరించిన రబాడ.. ప్రొవిజనల్ సస్పెన్షన్‌లో ఉన్నానని, త్వరలోనే తిరిగి మైదానంలోకి వస్తానని చెప్పాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు రబాడ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన ఆయన, ఏప్రిల్ 3న అకస్మాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయాడు.
ఆ సమయంలో వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లాడని జీటీ యాజమాన్యం ప్రకటించింది. కానీ ఇప్పుడు అసలు కారణం బయటపడింది.
Details
గుజరాత్
కాగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ రబాడను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
రెండు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇక రబాడపై నిషేధం విధించడానికి కారణమైన డ్రగ్ టెస్టు.. గత జనవరి-ఫిబ్రవరిలో జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ సమయంలో నిర్వహించిన పరీక్షలలో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది.
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నియమాల ప్రకారం.. ఆయనకు కనీసం మూడు నెలల నుంచి గరిష్ఠంగా నాలుగేళ్ల శిక్ష విధించే అవకాశముంది.
అయితే రబాడ ప్రదర్శన కోసమే డ్రగ్స్ తీసుకోలేదని నిరూపించగలిగితే.. అతని శిక్ష ముగింపు మూడు నెలలకే పరిమితమవుతుందని తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా డోపింగ్ నిరోధక సంస్థ చికిత్సా పథకాన్ని ఆమోదిస్తే శిక్షను రెండేళ్లకు తగ్గించే అవకాశమూ ఉంది.