Page Loader
Shubman Gill Fine: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కు భారీ షాక్.. ₹12 లక్షల జరిమానా ! 
Shubman Gill Fine: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కు భారీ షాక్.. ₹12 లక్షల జరిమానా !

Shubman Gill Fine: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కు భారీ షాక్.. ₹12 లక్షల జరిమానా ! 

వ్రాసిన వారు Stalin
Mar 27, 2024
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడినందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది . ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్‌ నిలిచాడు. 'ఐపీఎల్ 2024లో భాగంగా మార్చి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్‌ నమోదు చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించాం. ఐపీఎల్ నియమావళి మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించాం' అని ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Details 

ఇంకోసారి ఇలా చేస్తే.. గిల్ కెప్టెన్‌గా ఓ మ్యాచ్ నిషేధం  

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వెళ్లిన తరువాత తర్వాత గిల్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించాడు. ఐపీఎల్ 2024లో గుజరాత్ జట్టు చేసిన తోలి నేరం కావడంతో గిల్‌కి రూ.12 లక్షల జరిమానాతో బయటపడ్డాడు. రెండోసారి ఇది రిపీట్ అయితే రూ. 24 లక్షల జరిమానా, జట్టు సభ్యుల వేతనంలో కోత పడుతుంది. మూడోసారి కూడా ఇలానే జరిగితే .. జరిమానాతో పాటు కెప్టెన్‌ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్ కు జరిమానా