LOADING...
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2023
06:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఐపీఎల్ సమరం ప్రారంభం కానుంది. మార్చి 31న సీజన్ మొదలు కానుంది. చివరి మ్యాచ్ మే 28న జరగనుంది. 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడేళ్ల తర్వాత జట్లు తమ సొంత మైదానంలో ఆడడం గమనార్హం. ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మొదటి మ్యాచ్‌కు వేదిక కానుంది. చివరి లీగ్ మ్యాచ్ మే 21న జరగనుంది. అయితే ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.

ఐపీఎల్

ఐపీఎల్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు

ఐపీఎల్ 2023లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి లీగ్ రౌండ్ లో మొత్తం 10 జట్లు తలో 14 మ్యాచ్ లు ఆడనున్నాయి. దీంతో లీగ్ రౌండ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంటుంది. అ తర్వాత ఫ్లే ఆఫ్ లో నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ దశలో ప్రతి జట్టు సొంత మైదానంలో ఏడు మ్యాచ్‌లు ప్రత్యర్థి మైదానంలో ఏడు మ్యాచ్ లు ఆడనుంది. ఇది ఇలా ఉండగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో తొలి మ్యాచ్ మార్చి 4న జరగనుండగా.. ఫైనల్ మార్చి 26న జరగనుంది