
Asian Championships : అసియా ఛాంపియన్‌షిప్స్‌లో బోణీ కొట్టిన భారత్.. స్వర్ణంతో మెరిసిన గుల్వీర్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలోని గుమీలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ తొలి రోజునే భారత్ బోణీ కొట్టింది.
పురుషుల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చక్కటి ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఈ విజయంతో భారత్ తొలి రోజునే స్వర్ణం సాధించిన దేశంగా నిలవగా,గుల్వీర్ సింగ్ ఈ ఈవెంట్‌లో బంగారు పతకం గెలిచిన మూడో భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇదిలా ఉండగా, 29 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో భారత అథ్లెట్ సెర్విన్ సెబాస్టియన్ కాంస్య పతకం గెలిచాడు.
మరోవైపు, అదే ఈవెంట్‌లో పాల్గొన్న సవాన్ బర్వాల్ మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
కొద్దితేడాతో పతకాన్ని కోల్పోయిన అతను నిరాశకు గురయ్యాడు.
వివరాలు
మూడో భారతీయుడిగా
ఇక మహిళా అథ్లెట్ల ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోయింది. ఆసియా గేమ్స్ జావెలిన్ త్రోయింగ్ విజేత అన్ను రాణి ఈసారి మాత్రం నాలుగో స్థానంతో ముగించడంతో పతకం దక్కలేదు.
మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున తొలి పతకం రేస్‌వాక్‌లో సెర్విన్ సెబాస్టియన్ ఖాతాలో వేసుకున్నాడు.
1 గంట 21 నిమిషాలు 13.60 సెకన్లలో గమ్యానికి చేరుకున్న సెర్విన్ కాంస్య పతకం గెలిచాడు.
తర్వాత జరిగిన 10,000 మీటర్ల రన్నింగ్‌లో గుల్వీర్ సింగ్ తన సమర్థతను చాటుతూ గోల్డ్ మెడల్‌ను ఖచ్చితంగా కైవసం చేసుకున్నాడు.
వివరాలు
మూడో భారతీయుడిగా
ఈ ఏడాది ప్రారంభంలోనే జాతీయ రికార్డును బద్దలుకొట్టిన గుల్వీర్, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో జరిగిన ఫైనల్‌లో తీవ్ర పోటీ మధ్య ప్రత్యర్థులను ఓడించి స్వర్ణాన్ని అందుకున్నాడు.
ఈ విజయంతో గుల్వీర్ సింగ్, 10 వేల మీటర్ల ఈవెంట్‌లో బంగారు పతకం గెలిచిన మూడో భారతీయుడిగా గుర్తింపు పొందాడు.
ఇతని ముందు హరి చంద్ (1975), జి.లక్ష్మణన్ (2017)లు ఈ గౌరవాన్ని సాధించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అసియా ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణంతో మెరిసిన గుల్వీర్ సింగ్
Just look at the acceleration in the last lap 🤯
— The Khel India (@TheKhelIndia) May 27, 2025
- Very Well Done , Gulveer Singh 🇮🇳🥇pic.twitter.com/un6ym4m4MX https://t.co/8BcJr4g4qm