LOADING...
Gurjant Singh: హాకీకి గుర్జంత్ సింగ్ వీడ్కోలు
హాకీకి గుర్జంత్ సింగ్ వీడ్కోలు

Gurjant Singh: హాకీకి గుర్జంత్ సింగ్ వీడ్కోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన భారత హకీ జట్టు సభ్యుడు గుర్జంత్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికాడు. 31 ఏళ్ల గుర్జంత్, గతేడాది వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అనంతరం తిరిగి ఫిట్‌నెస్ సాధించి ప్రయత్నించినప్పటికీ, మళ్లీ భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2017లో అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఈ ఫార్వర్డ్, మొత్తం 130 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్ సాధించాడు. తన కెరీర్‌లో కీలక ఘట్టంగా 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

వివరాలు

కాంస్య పతకాలు సాధించిన భారత జట్లలో సభ్యుడు

అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన భారత జట్లలో సభ్యుడిగా నిలిచాడు. రిటైర్మెంట్‌పై గుర్జంత్ కీలక ప్రకటన చేశారు. గతేడాది జూన్‌లో జరిగిన ప్రొ హాకీ లీగ్ తర్వాత వెన్ను గాయం కారణంగా ఆటకు దూరమయ్యాను. తరువాత పునరాగమనం చేసి హాకీ ఇండియా లీగ్‌లో ఆడాను. అయితే సీనియర్ జట్టులోకి తిరిగి రావడం సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు హాకీకి వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయం అనిపించిందని తెలిపాడు.

Advertisement