Happy Birthday Yuvraj Singh: యువరాజ్.. ది బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. హ్యాపీ బర్తడే సిక్సర్ల కింగ్!
అతని జీవితమే ఓ పోరాటం. ఆట కోసం పోరాడాడు. బతకడానికి పోరాడాడు. ఇలా జీవితాంతం పోరాడి భారతీయుల మనసు గెలిచాడు. రెండు వరల్డ్ కప్‌లు, ఐదు ఛాంపియన్ షిప్స్ లు, వీటన్నింటిని మరిపించేలా కొట్టినా ఆ ఆరు సిక్సర్లు.. ఆల్ రౌండర్ ప్లేయర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ప్రస్థానమిది.. యువరాజ్ సింగ్ పేరు వింటేనే రొమాలు నిక్కబొడుచుకుంటాయి. 130 మంది కోట్ల అభిమానులు యూవీ అని ముద్దుగా పిలుచుకొనే ఆల్ రౌండర్ ఇవాళ 42వ వసంతంలోకి అడుగుపెట్టాడు. క్రికెట్‌లో పోరాట యోధుడిగా ఎదిగిన యూవీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన యూవీ ఆల్ రౌండర్‌గా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.
2000లో టీమిండియా తరుఫున అరంగేట్రం
యూవీ 2000 సంవత్సరంలో భారత జట్టు తరుఫున అరంగేట్రం చేశాడు. 2002లో నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో యూవీ 63 బంతుల్లో 69 పరుగులు చేసి లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పి విజయనాదం చేసేలా చేశాడు. 2000లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ లోనూ యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో క్యాన్సర్ తో పోరాడుతూ కూడా యువీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికి ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోయింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సులను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది.
2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యూవీ
రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. భారత్ తరుఫున మొత్తం 402 మ్యాచులు ఆడిన యూవీ 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలున్నాయి. బౌలింగ్ లోనూ మొత్తం 148 వికెట్లను పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు సార్లు హ్యాట్రిక్స్ తీసిన బౌలర్‌గా కూడా యూవీ చరిత్రకెక్కాడు. మొదట రాయల్ ఛాలెంజర్స్ తరుఫున హ్యాట్రిక్ తీసిన యూవీ, తర్వాత డెక్కన్ ఛార్జర్స్ పై హ్యాట్రిక్ అందుకున్నాడు. 2016, 2019లలో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లలో యువీ భాగమయ్యాడు.