Page Loader
ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు
పృథ్వీ షా కేసు పెట్టిన స్వప్నా గిల్

ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెటర్ పృథ్వీషా మరోసారి క్రికేటేతర కారణాలతో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్లో 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అడుతున్న ఈ స్టార్ ప్లేయర్ పై ముంబైలో కేసు నమోదైంది. అతనిపై ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ వేధింపుల కేసు పెట్టింది. ఫిబ్రవరిలో సప్నా గిల్, పృథ్వీ షా స్నేహితుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పృథ్వీ షా, అతని స్నేహితులు తనను వేధించి, దాడి చేశారని ఆమె ఆరోపించింది. తాజాగా ఈ ఘటనపై అంధేరి మేజిస్ట్రేట్ 66 కోర్టులో పృథ్వీ షా ఎఫ్ఐఆర్ నమోదైంది. అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద కేసు నమోదు చేశారు.

పృథ్వీ షా

బ్యాట్‌తో కొట్టారని ఆరోపించిన సప్నా గిల్

పృథ్వీ షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ పై కూడా కేసు నమోదైంది. ఈ ఇద్దరు కలిసి తనను బ్యాట్ కొట్టారని స్వప్నా గిల్ ఆరోపించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ ఏప్రిల్ 17న జరగనుంది. గతంలో పృథ్వీషా, అతని స్నేహితులపై ఆమె దాడి చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో సప్నా గిల్ సహా, అమె స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చి ఆమె తిరిగి పృథ్వీ షా కేసు పెట్టడం గమనార్హం. డోపింగ్‌ కారణంగా ఈ ఆటగాడిపై బీసీసీఐ 2019లో 8 నెలలు నిషేధం విధించిన విషయం తెలిసిందే.