LOADING...
Harbhajan Singh: పాక్ బౌలర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన హర్భజన్ సింగ్.. 
పాక్ బౌలర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన హర్భజన్ సింగ్..

Harbhajan Singh: పాక్ బౌలర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన హర్భజన్ సింగ్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అబుదాబి టీ10 లీగ్‌లో పాల్గొంటున్న భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రస్తుతం ఆస్పిన్ స్టాలియన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. బుధవారం నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన పోరులో ఆస్పిన్ స్టాలియన్స్‌ నాలుగుపరుగుల తేడాతో ఓటమిపాలైంది. నార్తర్న్ వారియర్స్ 115పరుగుల లక్ష్యాన్ని పెట్టగా,స్టాలియన్స్ ఇన్నింగ్స్‌ 110/7వద్ద ముగిసింది. నార్తర్న్ వారియర్స్ తరఫున పాక్ పేసర్ షానవాజ్ దహానీ రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరిన హర్భజన్,తదనంతరం దహానీతో చేతులు కలిపి శుభాకాంక్షలు తెలిపిన దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఏప్రిల్‌లో పహల్గాంఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగినప్పుడు దాయాది జట్టు ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేయట్లేదు.

వివరాలు 

పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టు కూడా ఇదే నిర్ణయం 

పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టు కూడా ఇదే నిర్ణయాన్ని అనుసరిస్తోంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్థాన్ జట్టుతో తలపడేందుకు భారత జట్టు అంగీకరించలేదు. ఆ జట్టులో హర్భజన్‌తో పాటు శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, వరుణ్ ఆరోన్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు ఉన్నారు. పాక్‌తో మ్యాచ్ ఆడబోమని వారంతా స్పష్టంగా ప్రకటించారు. సెమీఫైనల్లో కూడా పాకిస్థాన్‌ను ఎదుర్కోవాల్సి ఉన్నా భారత్ పోటీ నుంచి తప్పుకుంది. దాంతో పాక్ నేరుగా ఫైనల్‌కు చేరింది. ఈ సంఘటనలన్నింటి తరువాత ఇప్పుడు హర్భజన్ దహానీకి షేక్‌హ్యాండ్ ఇవ్వడంపై వేర్వేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.