IND vs SA: టెస్టు క్రికెట్‌ను నాశనం చేశారు.. హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో టెస్టు క్రికెట్‌ను పూర్తిగా దెబ్బతీసారంటూ మాజీ ఆఫ్‌స్పిన్నర్ హర్బజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలర్లకు అతిగా సహకరించే ఈడెన్ గార్డెన్స్ తరహా పిచ్‌లు భారత క్రికెటర్ల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని భజ్జీ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా చేధించలేక పరాజయం చెందడం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్లు టెస్టు క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేశారు. ఎన్నేళ్లుగానో ఇదే చూస్తున్నాను. పేలవమైన పిచ్‌లను తయారు చేస్తున్నారు. జట్టు గెలుస్తోందని, ఎవరో వికెట్లు తీస్తున్నారు కాబట్టి హీరోలుగా మారుతున్నారని... అందుకే ఈ పిచ్‌ల గురించి ఎవరూ మాట్లాడటం లేదని హర్భజన్ మండిపడ్డాడు.
Details
ఇలా క్రికెట్ ఆడడం పూర్తిగా తప్పు
ఇది అకస్మాత్తుగా మొదలైందేం కాదు. ఎన్నేళ్లుగానో ఇలాంటి పిచ్‌లు వాడుతున్నారు. ఇలా క్రికెట్ ఆడడం పూర్తిగా తప్పు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. "ఇలాంటి పిచ్‌లతో క్రికెటర్లు ఎదగరు. గెలుస్తున్నాం, కానీ దాంతో ఎలాంటి దీర్ఘకాల ప్రయోజనం లేదు. భారత క్రికెటర్ల అభివృద్ధికి ఇది పెద్ద అడ్డంకి అని భజ్జీ స్పష్టం చేశాడు. భారత్ తరఫున 103 టెస్టులు ఆడి 417 వికెట్లు పడగొట్టిన హర్భజన్ సింగ్, భారత టెస్టు క్రికెట్ దిశపై ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం కలకలం రేపుతోంది.