
Hardik Pandya: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. హార్ధిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు అనుకున్నట్లు సాగడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి, గత సీజన్‌లో లీగ్ దశకే పరిమితమై పోయింది.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతోందని కనిపిస్తోంది. 18వ సీజన్‌లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని మూటగట్టుకుంది.
ముంబయి కెప్టెన్‌గా హర్థిక్ పాండ్యా (Hardik Pandya) కొనసాగుతున్నా, ఫలితాల్లో మార్పు కనిపించడం లేదు.
సీజన్ తొలి మ్యాచ్‌కు దూరమైన పాండ్య.. గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే అతడి సమస్యలు ఇంకా సద్దుమణగలేదు.
Details
తొలి కెప్టెన్ గా హార్ధిక్
గత సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్న పాండ్య.. ఇప్పుడు గుజరాత్‌తో మ్యాచ్‌లో మళ్లీ అదే కారణంతో రూ. 12 లక్షల జరిమానా విధించించుకున్నారు.
ప్రస్తుత సీజన్‌లో ఈ రూల్ ప్రకారం జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్ పాండ్య కావడం గమనార్హం.
ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తొలిసారిగా స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘించడంతో, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం హార్దిక్ పాండ్యకు రూ. 12 లక్షల జరిమానా విధించామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది.
స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు కెప్టెన్ నిషేధానికి గురి కావడం లేదు. కానీ, అతడికి జరిమానాతో పాటు డీమెరిట్, సస్పెన్షన్ పాయింట్లు కేటాయిస్తారు.
Details
2024 సీజన్‌లో కూడా ఇదే సమస్య
హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ముంబయి 2024 సీజన్‌లోనూ ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంది. లఖ్‌నవూతో చివరి మ్యాచ్ ఆడేలోపే, ఇప్పటికే రెండు సార్లు స్లో ఓవర్ రేట్ జరిమానా విధించారు.
పంజాబ్‌తో మ్యాచ్: రూ. 12 లక్షలు జరిమానా
లఖ్‌నవూతో మొదటి మ్యాచ్: రూ. 24 లక్షలు జరిమానా
లఖ్‌నవూతో రెండో మ్యాచ్: రూ. 30 లక్షలు జరిమానా + ఒక మ్యాచ్ నిషేధం
ఈ కారణంగా 2025 సీజన్ తొలి మ్యాచ్ నుంచి పాండ్య నిషేధం ఎదుర్కొవాల్సి వచ్చింది.
Details
డీమెరిట్ పాయింట్లు
ప్రస్తుత సీజన్‌లో, హార్దిక్ పాండ్య ఇప్పటికే 4 డీమెరిట్ పాయింట్లు పొందాడు. మళ్లీ స్లో ఓవర్ రేట్ ఉల్లంఘన జరిగితే, మ్యాచ్ రిఫరీ ఫీజులో 100శాతం విధించడంతో పాటు, అదనపు డీమెరిట్ పాయింట్లు కేటాయించొచ్చు.
మూడుసార్లు స్లో ఓవర్ రేట్ ఉల్లంఘన చేసినా, ఇకపై వెంటనే మ్యాచ్ నిషేధం ఉండదు. కానీ డీమెరిట్ పాయింట్లు గరిష్ట పరిమితిని చేరుకుంటే మాత్రమే ఐపీఎల్ మేనేజ్‌మెంట్ మ్యాచ్ నిషేధంపై నిర్ణయం తీసుకుంటుంది.
ముంబయి ఇండియన్స్ వరుస ఓటములతో పాటు, కెప్టెన్ హార్దిక్ పాండ్య జరిమానాలు, డీమెరిట్ పాయింట్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.
ఈ సమస్యల నుంచి బయటపడటానికి జట్టు ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో వేచి చూడాలి.