Page Loader
టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?
టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా

టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2023
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేటి నుండి జరిగే శ్రీలంక సిరీస్‌ టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరిస్తారో లేదో వేచి చూడాలి. భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ను శ్రీలంక ఇంతవరకు గెలవలేదు. ఈ రికార్డును శ్రీలంక కెప్టెన్ దనుష్‌శనకకు మార్చే అవకాశం లేకపోలేదు. భారత టీ20 లీగ్‌(T20 League) ముంగిట కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టైంలో ప్రయోగాలను చేయడం మంచిది కాదు. కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకెళ్లి, జట్టులో అందరికీ అవకాశాలను అందేలా చేస్తామని హార్ధిక్ చెప్పారు.

హర్ధిక్ పాండ్యా

వాంఖేడ్ స్టేడియం చేజింగ్‌కి అనుకూలం

ఈ నెల చివర్లో న్యూజిలాండ్‌తో భారత్ మరో సిరీస్ అడనుంది. ఒక్కో ఆటగాడు వేర్వేరు పరిస్థితులకు ఎలా ఎదుర్కొంటారో ఇలోగా మనం తెలుసుకోవచ్చు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీగా జట్టును ఏ విధంగా ముందుకు నడిపించగలడో అర్థమవుతుంది. శ్రీలంకతో జరిగే టీ20 మ్యాచ్‌లో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. దసున్‌షనక నేతృత్వంలో శ్రీలంక జట్టు ఆసియా కప్‌ను గెలుచుకుంది. వాంఖడే స్టేడియంలో చేజింగ్‌కి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మ్యాచ్ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది. శివమ్ మావి, ముఖేష్ కుమార్ అరంగేట్రం చేయడానికి వేచి ఉండాల్సి ఉంటుంది.