తదుపరి వార్తా కథనం

Harmanpreet Kaur: మిథాలీ రాజ్‌ను రికార్డును బ్రేక్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా తరుపున అరుదైన ఘనత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 07, 2025
05:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు స్థాపించింది. సిద్రా అమీన్‌పై క్యాచ్ అందించడంతో ఆమె టీమిండియా తరుపున అత్యధిక క్యాచ్‌లను అందుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్రలో చోటు సంపాదించుకుంది. ఈ ఘనతతో హర్మన్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అధిగమించింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ 154 మ్యాచ్‌ల్లో 65 క్యాచ్‌లతో రికార్డు నమోదు చేసింది. కాగా, అత్యధిక క్యాచ్‌ల రికార్డు జూలన్ గోస్వామి (204 మ్యాచ్‌ల్లో 69 క్యాచ్‌లు) వద్ద ఉంది.
Details
భారత మహిళల క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు సాధించిన ఆటగాళ్లు
జూలన్ గోస్వామి - 204 మ్యాచ్‌ల్లో 69 క్యాచ్‌లు హర్మన్ ప్రీత్ కౌర్ - 154 మ్యాచ్‌ల్లో 65 క్యాచ్‌లు మిథాలీ రాజ్ - 232 మ్యాచ్‌ల్లో 64 క్యాచ్‌లు దీప్తి శర్మ - 114 మ్యాచ్‌ల్లో 40 క్యాచ్‌లు రుమేలీ ధర్ - 78 మ్యాచ్‌ల్లో 37 క్యాచ్‌లు స్మృతి మంధాన - 110 మ్యాచ్‌ల్లో 35 క్యాచ్‌లు