సూపర్ రికార్డుకు చేరువలో హర్మన్ ప్రీత్ కౌర్
భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉంది. ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆ ఫీట్‌ను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 60 పరుగులు సాధిస్తే ఆ మైలురాయిని అందుకొనే అవకాశం ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం ఉమెన్స్ టీ20 క్రికెట్‌లో 3వేల పరుగులకు చేరువలో హర్మన్ ప్రీత్ కౌర్ ఉంది. ఆ ఘనతను సాధిస్తే ఉమెన్స్ టీ20 క్రికెట్ లీగ్‌లో 3వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి హర్మన్‌ప్రీత్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది.
హర్మన్ ప్రీత్ కౌర్ సాధించిన రికార్డులివే
హర్మన్‌ప్రీత్ 2009లో ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం 146 మ్యాచ్‌లలో 28.26 సగటుతో 2,940 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధ సెంచరీలున్నాయి. స్వదేశంలో హర్మన్‌ప్రీత్ 30.87 సగటుతో 1,019 పరుగులు చేసి సత్తా చాటింది. WT20I క్రికెట్‌లో సుజీ బేట్స్ (3,683), మెగ్ లానింగ్ (3,256), స్టాఫానీ టేలర్ (3,121) మాత్రమే 3వేల మార్కను అధిగమించారు. హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా డబ్ల్యూటీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. 91 మ్యాచ్‌లలో 31.40 సగటుతో 2,010 పరుగులు చేసింది. షార్లెట్ ఎడ్వర్డ్స్ (2,529), లానింగ్ (2,470) మాత్రమే అమె కంటే ముందు ఉన్నారు.