Page Loader
భారత్ హాకీ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్
భారత్ హాకీ జట్టు

భారత్ హాకీ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2022
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని భువనేశ్వర్-రూర్కెలాలో జనవరి 2023లో జరగనున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల ప్రపంచ కప్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) బెంగళూరు సెంటర్‌లో రెండు రోజుల ట్రయల్ తర్వాత జట్టును ఎంపిక చేశారు. భారత హాకీ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్ ఎంపికయ్యాడు. కాగా, అమిత్ రోహిదాస్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నారు. ఇంగ్లండ్‌, స్పెయిన్‌, వేల్స్‌తో పాటు పూల్‌ డిలో భారత్‌ చేరింది. రూర్కెలాలోని కొత్తగా నిర్మించిన బిర్సా ముండా స్టేడియంలో మెన్ ఇన్ బ్లూ తమ మొదటి మ్యాచ్ ను జనవరి 13న స్పెయిన్‌తో ఆడుతుంది. ఫైనల్ మ్యాచ్ జనవరి 29న జరగనుంది.

హాకీ

18 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇదే..

గోల్ కీపర్లు: P.R. శ్రీజేష్, కృష్ణ పాఠక్ డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్ (వైస్ కెప్టెన్), నీలం సంజీప్ మిడ్‌ఫీల్డర్లు: మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఆకాశ్‌దీప్ సింగ్ ఫార్వర్డ్స్: మన్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్ స్టాండ్‌బై: రాజ్‌కుమార్ పాల్, జుగ్రాజ్ సింగ్