Page Loader
ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్
169 బంతుల్లో 184 పరుగులు చేసిన బ్రూక్ హ్యారీ

ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2023
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టులో చేలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన బ్రూక్.. రెండో టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీని మార్క్ ను అందుకున్నాడు. టెస్టులో ఇది అతడికి నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. బ్రూక్ 169 బంతుల్లో 184 పరుగులు చేసి డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 21 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. జో రూట్, హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీలతో ఇంగ్లండ్‌కు మంచి స్కోరును అందించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 315/3 స్కోరు చేసింది.

హ్యారీ బ్రూక్

బ్రూక్ సాధించిన రికార్డులివే

బ్రూక్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో టెస్టుల్లో అత్యంత వేగంగా 800 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు భారత ఆటగాడు వినోద్‌కాంబ్లీ (798) పేరిట ఉండేంది. గతేడాది సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో అరంగేట్రం చేసిన బ్రూక్ ఇప్పటివరకు ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 100.88 సగటుతో 807 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ సిరీస్ ఓపెనర్‌లో జంట అర్ధసెంచరీలతో తిరిగి వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లో 54 పరుగులు చేశాడు.