ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ అద్భుత రికార్డు
ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ సంచలన రికార్డును నమోదు చేశారు. 200వ ప్రీమియర్ లీగ్ గోల్ ను సాధించి అద్భుత రికార్డును తన పేరిట రాసుకున్నారు. ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కారు. ఆదివారం మాంచెస్టర్ సిటీతో జరిగిన ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో స్పర్స్ తరపున 15వ నిమిషంలో గోల్ చేసిన కేన్ ఈ మార్కును అందుకున్నారు. ఇంతకుముందు షియరర్, వేన్ రూనీ 200వ గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని హ్యారికేన్ అందుకోవడం విశేషం. కేన్ 304 ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు.
షిమిరర్, వేన్‌రూనీ సరసన నిలిచిన హ్యారికేన్
షియరర్ 260 ప్రీమియర్ లీగ్ గోల్స్ సాధించి, 306 మ్యాచ్‌లలో 200 గోల్స్ సాధించి సత్తా చాటాడు రూనీ 462 మ్యాచ్ లలో 208 ప్రీమియర్ లీగ్ గోల్స్ చేశారు. బాబీ స్మిత్, మొత్తం 208 గోల్స్‌తో, టోటెన్‌హామ్ తరఫున 200-ప్లస్ గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. షియరర్, వేన్ రూనీ వారితో కలిసి 200 గోల్స్ చేసిన ఆటగాడిగా హ్యారీ కేన్ నిలిచాడు