Loading...
ENG Vs IND: భారత్‌కు షాక్.. మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ దూరం
భారత్‌కు షాక్.. మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ దూరం

ENG Vs IND: భారత్‌కు షాక్.. మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ దూరం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేయడంతో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, కీలక పోరుకు ముందు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. రెండో వన్డేలో తొడ కండరాల గాయానికి గురైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు.

వివరాలు

భారత జట్టులో స్థానం..

దీంతో అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబెను జట్టులోకి చేర్చినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది.

హర్ష్ దూబె ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

ధర్మశాలలో జరిగిన ఆ మ్యాచ్‌లో 47 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

అలాగే జులై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు కూడా హర్ష్ దూబె ఇప్పటికే భారత జట్టులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT