Page Loader
Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు
లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు

Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
11:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. బంతుల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు అందుకున్న బౌలర్‌గా హర్షల్ రికార్డుకెక్కాడు. మొత్తం 2381 బంతుల్లో ఈ మైలురాయిని చేరిన హర్షల్ పటేల్, ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగను దాటేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను హర్షల్ నమోదు చేశాడు. ఇంతకు ముందు 2444 బంతుల్లో ఈ రికార్డును మలింగ సాధించిన విషయం తెలిసిందే.

Details

ఐపీఎల్

తాజా మ్యాచ్‌లో 63 బంతుల తేడాతో మలింగ రికార్డును హర్షల్ బ్రేక్ చేశాడు. మొత్తం మ్యాచ్‌ల పరంగా చూస్తే, 150 వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో హర్షల్ పటేల్ (117 మ్యాచ్‌లు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ (105 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు 2381 బంతులు - హర్షల్ పటేల్ 2444 బంతులు - లసిత్ మలింగ 2543 బంతులు - యుజ్వేంద్ర చాహల్ 2656 బంతులు - డ్వైన్ బ్రావో 2832 బంతులు - జస్ప్రీత్ బుమ్రా

Details

మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు 

లసిత్ మలింగ - 105 మ్యాచ్‌లు హర్షల్ పటేల్ - 117 మ్యాచ్‌లు యుజ్వేంద్ర చాహల్ - 118 మ్యాచ్‌లు రషీద్ ఖాన్ - 122 మ్యాచ్‌లు జస్ప్రీత్ బుమ్రా - 124 మ్యాచ్‌లు