India vs England: కంకషన్ వివాదంపై స్పందించిన భారత యువ పేసర్.. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన హర్షిత్ రాణా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ సంఘటన తీవ్ర వివాదాస్పదమైందనేది తెలిసిందే. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ భారత్ ఇంగ్లండ్‌తోనే తలపడుతోంది.
తాజా మ్యాచ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన హర్షిత్, కీలకమైన వికెట్లు పడగొట్టి తన ప్రతిభను చాటాడు.
మూడు వికెట్లు తీసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సందర్భంగా, కంకషన్ వివాదంపై హర్షిత్ స్పందించాడు.
వివరాలు
క్రికెట్‌లో కామెంట్లు సహజమే
"బయట నుంచి క్రికెట్‌ను వీక్షించే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తూనే ఉంటారు. అవి మంచి కావొచ్చు, చెడు కావొచ్చు, కానీ నేను మాత్రం నా ఆటపై దృష్టిపెడతా. అలాంటి వ్యాఖ్యలను నేను పెద్దగా పట్టించుకోను. నా దేశం కోసం నేను ఆడతా, అంతేకానీ, అనవసరమైన స్పందనలు ఇవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను," అని హర్షిత్ అన్నాడు.
వివరాలు
అరంగేట్రం అనుకోకుండా జరిగింది
"అంతర్జాతీయ వన్డేలో అరంగేట్రం చేస్తానని ముందుగా నాకు తెలియలేదు. మైదానంలోకి వచ్చాకనే అది తెలిసింది. అయితే, మానసికంగా అప్పటికే నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు అవకాశమొస్తుందో అని ఎదురుచూస్తూ, ఉత్తమ ప్రదర్శన చేయాలనే సంకల్పంతో ఉన్నా. తొలి ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చినా, క్రికెట్‌లో ఇటువంటి ఒడిదొడుకులు సహజమే. నేను నా లెంగ్త్‌పై దృష్టి సారించాను. ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు వస్తాయో అర్థం చేసుకున్నాను. రెండో స్పెల్‌లో ప్రత్యేకంగా ఏమీ మార్పు చేయలేదు, సరైన లెంగ్త్‌లో బంతిని వేయడంపై మాత్రమే దృష్టిపెట్టాను," అని హర్షిత్ వివరించాడు.