Harshit Rana: ఆల్ రౌండర్ ప్రదర్శనతో దుమ్మురేపిన హర్షిత్ రాణా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన టీమిండియా పేసర్ హర్షిత్ రాణా తన అద్భుత ప్రదర్శనతో రంజీ ట్రోఫీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం దేశవాలీ టోర్నీలో దిల్లీ తరఫున ఆడుతున్న హర్షిత్, అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో తన ఆల్‌రౌండ్ ప్రతిభను చూపి అందరినీ అలరించాడు. మొదట బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీయగా (5/80), ఆపై బ్యాటింగ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన అస్సాం 330 పరుగులకే ఆలౌటైంది. సుమిత్ (162) భారీ సెంచరీ సాధించగా, శివ్‌శంకర్ రాయ్ (59) తో రాణించాడు.
ఐదు వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా
దిల్లీ బౌలర్లలో హర్షిత్ ఐదు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులు చేసింది. సుమిత్ మాథుర్ (112) శతకంతో రాణించగా, హిమ్మద్ సింగ్ (55), హర్షిత్ రాణా (59), సిద్దాంత్ శర్మ (89) హాఫ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ నాలుగు వికెట్లు, పుర్కాయస్తా మూడు వికెట్లు తీశారు. అస్సాం సెకెండ్ ఇన్నింగ్స్‌లో 124 పరుగుల వెనుకబడి, నాలుగో రోజు మొదటి సెషన్ వరకు 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేసింది. దిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా, మోనీ గ్రేవల్ తలో రెండు వికెట్లు, జాంటీ సిద్దూ, సిద్దాంత్ శర్మ చెరో వికెట్ తీశారు.