LOADING...
IND vs AFG: అఫ్గాన్‌పై మూడో వన్డేలో ప్రసిద్ధ్‌ మెరుపులు.. రోహిత్‌తో కలిసి అరుదైన రికార్డు
అఫ్గాన్‌పై మూడో వన్డేలో ప్రసిద్ధ్‌ మెరుపులు.. రోహిత్‌తో కలిసి అరుదైన రికార్డు

IND vs AFG: అఫ్గాన్‌పై మూడో వన్డేలో ప్రసిద్ధ్‌ మెరుపులు.. రోహిత్‌తో కలిసి అరుదైన రికార్డు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 20, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్‌ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి 10 ఓవర్లలో ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ప్రసిద్ధ్‌ కేవలం ఆరు పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్‌లో రెండు మెయిడిన్‌ ఓవర్లు ఉండటం విశేషం. ప్రసిద్ధ్‌ సాధించిన నాలుగు వికెట్లలో తొలి మూడు వికెట్లకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫస్ట్‌ స్లిప్‌లో అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. రహ్మనుల్లా గుర్బాజ్‌ (5), ఇబ్రహీం జద్రాన్‌ (11), రహ్మత్‌ షా (5) ఇచ్చిన అవకాశాలను రోహిత్‌ ఏమాత్రం తప్పకుండా ఒడిసిపట్టాడు.

వివరాలు

మూడు క్యాచ్‌లతో రోహిత్‌ శర్మ రికార్డు..

ఈ మూడు క్యాచ్‌లతో రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వన్డే మ్యాచ్‌లో ఒకే బౌలర్‌ బౌలింగ్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు 2004లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఇర్ఫాన్‌ పఠాన్‌ బౌలింగ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ మూడు క్యాచ్‌లు అందుకోగా, 2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్‌ ధావన్‌ ఇదే ఘనత సాధించాడు. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణ-రోహిత్‌ శర్మ జోడీ కూడా అదే ఫీట్‌ను పునరావృతం చేసి భారత క్రికెట్‌ చరిత్రలో తమ పేర్లను నమోదు చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

Advertisement