
Shikhar Dhawan: 'కార్గిల్‌ను మర్చిపోయారా అఫ్రిదీ?'.. శిఖర్ ధావన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
అతనికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు చెలరేగగా, భారత-పాక్ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
Details
మీ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోండి
ఈ వ్యాఖ్యలపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందిస్తూ అఫ్రిదీకి బహిరంగంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు.
''కార్గిల్ యుద్ధంలో మేం మీ దేశాన్ని ఓడించాం. అది మరచిపోయారా? మీరు ఇప్పటికే పతనమైపోయారు.
ఇంకా ఎంత దిగజారతారు? అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం మానేసి, మీ దేశ పరిస్థితి మెరుగుపరిచే దిశగా ఆలోచించండి.
భారత సైన్యం పట్ల మేం గర్వంగా భావిస్తున్నామని శిఖర్ ధావన్ ఎక్స్ వేదికగా స్పందించాడు.
Details
ఆఫ్రిది వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన అఫ్రిదీ.. భారత సైన్యంపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యానిస్తూ, ''ఈ దాడిని భారత సైన్యం ఎందుకు ఆపలేకపోయింది? అంటూ ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అతనిపై సర్వత్రా విమర్శల వర్షం పడుతోంది. ఈ దాడికి పాక్‌కు చెందిన సీమాంతర ఉగ్రవాద సంస్థలే కారణమని భారత్ ఇప్పటికే ప్రకటించింది.
దాంతోపాటు, పాక్‌తో దౌత్య సంబంధాలపై పునఃపరిశీలన చేస్తూ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పాక్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.