
HBD Sourav Ganguly: డేరింగ్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ తలరాతను మలచిన బెంగాల్ టైగర్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో "దాదా" అనగానే గుర్తొచ్చే వ్యక్తి సౌరబ్ గంగూలీ. జట్టును ఇంటి మైదానాల్లోనే కాదు, విదేశీ గడ్డపై కూడా విజయం సాధించే విధంగా తీర్చిదిద్దిన నాయకుడు ఆయన. భారత్ అంటే ఇంట్లోనే జైత్రయాత్ర చేసే జట్టు.. అనే ముద్రను తొలగించిన కెప్టెన్. జూలై 8, 1972న కోలకతాలో జన్మించిన గంగూలీ, ప్రస్తుతం తన 54వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేష ఘట్టాలను గుర్తు చేసుకుందాం. 1997లో వరుసగా నాలుగు వన్డే మ్యాచుల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలిచిన ఏకైక ఆటగాడిగా గంగూలీ చరిత్ర సృష్టించాడు.
వివరాలు
వన్డేల్లో సౌరవ్ గంగూలీ మొత్తం 11,363 పరుగులు
అంతే కాదు,వరుసగా నాలుగు సంవత్సరాల పాటు (1997 నుండి 2000 వరకు) ప్రతి ఏడాది 1000కి పైగా పరుగులు సాధించిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన పరుగులు ఇలా ఉన్నాయి — 1997లో 1338, 1998లో 1328, 1999లో 1767, 2000లో 1579 పరుగులు. వన్డేల్లో సౌరవ్ గంగూలీ మొత్తం 11,363 పరుగులు చేశారు.భారత వేదికపై అతిపెద్ద లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ప్రపంచ స్థాయిలో కుమార్ సంగక్కర (14,234),సనత్ జయసూర్యా (13,430)తర్వాత మూడో స్థానంలో నిలిచిన ఆటగాడు గంగూలీనే. అంతేకాక,వన్డేల్లో 10,000కి పైగా పరుగులు చేయడంతో పాటు 100కి పైగా వికెట్లు తీసిన ప్రపంచంలో కేవలం ఆరుగురు ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.
వివరాలు
సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ ఓపెనింగ్ జోడీ
22 వన్డే శతకాలలో 18 శతకాలను విదేశీ గడ్డపై సాధించడం గంగూలీ స్థిరతను తెలుపుతుంది. అంతేకాదు, ఐసీసీ వన్డే టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లలో మూడు శతకాలు చేసిన అరుదైన ఆటగాళ్లలో ఆయన ఒకరు. ఈ జాబితాలో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లాంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. 2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆయన చేసిన 117పరుగులు మరువలేనివి. సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ ఓపెనింగ్ జోడీ వన్డేల్లో కలిసిగా 176ఇన్నింగ్స్‌లలో 8227 పరుగులు చేసింది. ఇది ఇప్పటికీ ఓ అద్భుత రికార్డుగా నిలిచింది. ఇక 1999 వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకపై గంగూలీ చేసిన 183 పరుగులు, ప్రపంచకప్‌లో భారత ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఇప్పటికీ నిలిచింది.
వివరాలు
కెరియర్ చివరలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న గంగూలీ
అలాగే 2007లో పాకిస్తాన్‌పై గంగూలీ చేసిన 239 పరుగుల ఇన్నింగ్స్, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్‌గా ఆయన అద్భుత సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ స్కోరు ఇప్పటివరకు ఎవరికీ అందని శిఖరం. అయితే ఈ గొప్ప కెరియర్ చివరలో గంగూలీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆట నుంచి విరమణ చేసిన అనంతరం, కొంతకాలం బీసీసీఐ చైర్మన్‌గా కూడా సేవలందించారు. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వలన ఆయన ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.