అతడు మా జట్టులో కీలకమైన ఆటగాడు.. ఆసీస్ ప్రధాన కోచ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. ఈ తరుణంలో ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.ప్రస్తుతం ఐపీఎల్ మూడ్రోజుల్లో ముగియనుంది. ఈ ఐపీఎల్ పూర్తియైన వెంటనే ఆటగాళ్లు డబ్య్లూటీఎఫ్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రాక్టీసును మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, కోచ్ ద్రవిడ్, మరో ఏడుగురు భారత ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్ కు బయలుదేరిన విషయం తెలిసిందే. తమ జట్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్ లో ఉన్నాడని, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ చివరి మ్యాచులో కీలకపాత్ర పోషిస్తాడని ఆసీస్ ప్రధాన కోచ్ మెక్ డొనాల్డ్ స్పష్టం చేశాడు.
డేవిడ్ వార్నర్ పై భారీ ఆశలు
ఈ ఐపీఎల్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడని, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వార్నర్ దూకుడు ప్రదర్శన చూపాడని, టోర్నీ జట్టు మొత్తం విఫలమైనా, అతను ఒంటరి పోరాటం చేశాడని మెక్ డొనాల్డ్ వెల్లడించారు. ఐపీఎల్ లో 14 మ్యాచులు ఆడి 516 పరుగులు చేశాడని, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో వార్నర్ పై చాలా ఆశలు పెట్టుకున్నామని, అతను పెద్ద పాత్ర పోషిస్తాడనే నమ్మకంతో అతడిని జట్టులోకి ఎంపిక చేసినట్లు మెక్ డొనాల్డ్ చెప్పుకొచ్చాడు. జున్ 7 నుంచి ఇంగ్లండ్ లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది.