
రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.
ఆఫీసు నుంచి తనను దారుణంగా వెళ్లగొట్టారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
తాజాగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వహెబ్ రియాజ్ రమీజ్ పై సంచలన ఆరోపణలు చేశారు. 'రమీజ్ భాయ్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు 4-5 సార్లు మెసేజ్ చేశా. అతను తిరిగి సందేశం పంపలేదని వాపోయారు. చాలామంది క్రికెటర్లు గతంలో రమీజ్ రాజా పనితీరుపై విమర్శలు చేశారని, ఆతని పని విధానాలు ఎవరికి నచ్చేది కాదన్నారు.
రమీజ్ రాజా
'30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఆడటానికి అనర్హులు'
రమీజ్ భాయ్ వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ విషయం బోర్డు సభ్యులైన ఒకరితో చెప్పాను. రమీజ్‌కు సందేశం పంపినప్పుడు రిప్లే కోసం వేయిట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. నేనింకా క్రికెటర్ ఆడుతున్నా, ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదని సమా టీవీలో తాను చేసిన పోరాటం గురించి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ వెల్లడించాడు.
"30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఆడటానికి అనర్హులన్నారు. ఇది జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని అన్నారు. క్రికెట్లో ఏ ఆటగాడికి ఇవ్వని అవకాశాలు మాజీ ఆటగాడు రమీజ్ భాయ్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదన్నారు.