Loading...
Virat Kohli: టెస్టుల నుంచి తప్పుకోవాల్సింది కాదు.. కోహ్లీకి ఇంకా సత్తా ఉంది: కపిల్ దేవ్
టెస్టుల నుంచి తప్పుకోవాల్సింది కాదు.. కోహ్లీకి ఇంకా సత్తా ఉంది: కపిల్ దేవ్

Virat Kohli: టెస్టుల నుంచి తప్పుకోవాల్సింది కాదు.. కోహ్లీకి ఇంకా సత్తా ఉంది: కపిల్ దేవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల నుంచి తప్పుకోవాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం అతడి కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు అని అభిప్రాయపడ్డాడు. ఎంతో ఫిట్‌గా ఉన్న విరాట్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంకా రాణించే సత్తా ఉందని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల భవిష్యత్తులో కోహ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని వ్యాఖ్యానించాడు. 2025 మేలో కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

వివరాలు

పదేళ్ల తర్వాత బాధపడతాడు: కపిల్ దేవ్

'కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయి అతిపెద్ద తప్పు చేశాడని అనుకుంటున్నా. ఈ నిర్ణయం తీసుకున్నందుకు పదేళ్ల తర్వాత అతడు పశ్చాత్తాపపడతాడు.

ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. అతడికి ఉన్నంత అద్భుతమైన ఫిట్‌నెస్ మరే ఆటగాడికి లేదు. కోపంతో రిటైర్ అవ్వడం సరికాదు.

ఇలాంటి విషయాల్లో మొహిందర్ అమర్‌నాథ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. అతడిని ఎన్నోసార్లు జట్టు నుంచి తొలగించారు.

అయినప్పటికీ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుని.. తన విషయంలో ఇతరుల అంచనాలు తప్పని నిరూపించాడు'' అని కపిల్ దేవ్ గుర్తుచేసుకున్నాడు.

వివరాలు

వన్డేల్లోనే కొనసాగుతున్న కోహ్లీ

టెస్టులు, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు.

మొత్తంగా ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌ల్లో 638 పరుగులు సాధించాడు.

ADVERTISEMENT