LOADING...
Sunil Gavaskar: పవర్‌ప్లేలో రిస్క్ తీసుకున్నాడు.. సంజు శాంసన్‌పై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు!
పవర్‌ప్లేలో రిస్క్ తీసుకున్నాడు.. సంజు శాంసన్‌పై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు!

Sunil Gavaskar: పవర్‌ప్లేలో రిస్క్ తీసుకున్నాడు.. సంజు శాంసన్‌పై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ పోరులో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసిన సంజు, తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో బ్లెసింగ్ ముజారబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో తనకు లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంజు శాంసన్‌కు మద్దతుగా నిలిచాడు.

Details

వేగంగా పరుగులు తీసే క్రమంలో ఔట్ అయ్యాడు

పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించే క్రమంలోనే అతడు అవుటయ్యాడని పేర్కొన్నాడు. "అతడిని మనం నిందించలేం. పవర్‌ప్లేలో ఫీల్డింగ్ పరిమితుల ప్రయోజనాన్ని పొందే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడని గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ మెగా టోర్నీలో ఎక్కువ మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ప్రత్యర్థి జట్లు స్పిన్ వ్యూహాన్ని అమలు చేశాయి. పాకిస్థాన్ జట్టు సల్మాన్ అలీ అఘా చేత బంతి వేయించగా, నెదర్లాండ్స్ ఆర్యన్ దత్‌ను ఉపయోగించింది. దక్షిణాఫ్రికా ఐడెన్ మార్‌క్రమ్‌ను బౌలింగ్‌కు దింపి ఫలితాలు సాధించింది.

Advertisement