
Travis Head:ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు.. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండో బ్యాటర్‌గా రికార్డు..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున చెలరేగి ఆడుతున్నఓపెనర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
ఈ సీజన్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.
అతను ఈ ఘనతను కేవలం 575 బంతుల్లో సాధించాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్ 27 పరుగులు చేసిన వెంటనే తన ఐపీఎల్ కెరీర్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు.
వివరాలు
వెయ్యి పరుగుల మార్కును చేరిన ఆటగాళ్లు మొత్తం ఐదుగురు మాత్రమే
ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే,అత్యల్ప బంతుల్లో వెయ్యి పరుగుల మార్కును చేరిన ఆటగాళ్లు మొత్తం ఐదుగురు మాత్రమే ఉన్నారు.
ఈ జాబితాలో కరీబియన్ సుడిగాలి ఆండ్రూ రసెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్ కేవలం 545 బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు.
ట్రావిస్ హెడ్ తర్వాత రెండో స్థానంలో ఉండగా,హెన్రిచ్ క్లాసెన్,వీరేంద్ర సెహ్వాగ్,గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు వరుసగా మూడవ, నాలుగవ, ఐదవ స్థానాల్లో ఉన్నారు.
సన్‌రైజర్స్ తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్న క్లాసెన్ 594 బంతుల్లో వెయ్యి పరుగులు సాధించాడు.
మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఫీట్‌ను 604 బంతుల్లో సాధించగా,ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ 610 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండో బ్యాటర్‌గా రికార్డు..
Travis Head the second-fastest batter to score 1000 IPL runs in terms of balls faced 🙌#IPL2025 #IPL #TravisHead #SRH pic.twitter.com/ESJ60Ou16z
— Circle of Cricket (@circleofcricket) April 17, 2025