LOADING...
BenStokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం 
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం

BenStokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2024
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. అక్టోబర్ 17న నార్త్ఈస్ట్ ఇంగ్లండ్‌లోని కాస్టల్ ఈడెన్ ప్రాంతంలో ఉన్న స్టోక్స్ ఇంట్లోకి ముసుగులు ధరించిన కొందరు దొంగలు ప్రవేశించారు. తర్వాత విలువైన వస్తువులను దోచుకెళ్లారని స్టోక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఆ సమయంలో స్టోక్స్ పాకిస్థాన్ పర్యటనలో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారని, అయితే వారికి ఎటువంటి గాయాలు కలగలేదని తెలిపాడు.

Details

ఆ వస్తువులను తిరిగి ఇచ్చేయండి

కొద్దిమంది మాస్క్‌లు ధరించి ఇంట్లోకి వచ్చి, విలువైన నగలు, డిజైనర్ బ్యాగ్, క్రికెట్ సేవలకు గౌరవార్థం పొందిన ప్రత్యేక మెడల్‌ను దోచుకెళ్లారని స్టోక్స్ పేర్కొన్నారు. తనకు ఆ వస్తువులు తిరిగి అందించమని దోషులకు విజ్ఞప్తి చేశాడు. కుటుంబానికి ఆ వస్తువులపై ప్రత్యేక అనుబంధం ఉందని, వాటిని మళ్లీ పొందడం చాలా కష్టమని వెల్లడించాడు.