టెస్టుల్లో డబుల్ సెంచరీని బాదేసిన హెన్రీ నికోల్స్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు విజృంభించారు. ఫలితంగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ప్లేయర్లు విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) ద్విశతకాలతో విజృంభించారు. ముఖ్యంగా హెన్రీ నికోల్స్ టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. హెన్రీ నికోల్స్ 200 పరుగులు చేయడంతో వెంటనే సౌతాఫ్రికా డిక్లరేషన్ వచ్చింది. నికోల్స్ కేన్ విలియమ్సన్‌తో మూడో వికెట్‌కు 363 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డిసెంబర్ 2020లో నికోల్స్ వెస్టిండీస్ పై అత్యధికంగా 174 పరుగులు చేశాడు. ప్రస్తుతం డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. టెస్టుల్లో నాలుగు సార్లు 150 ప్లస్ స్కోరును సాధించాడు.
డబుల్ సెంచరీ సాధించిన 18వ ఆటగాడిగా నికోల్స్
54వ టెస్టులు ఆడిన నికోల్స్ ప్రస్తుతం 38.78 సగటుతో ఫార్మాట్‌లో 2,948 పరుగులకు చేరాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నికోల్స్ ప్రస్తుతం టెస్టుల్లో సెంచరీల పరంగా మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను సమం చేశాడు. కివీ బ్యాటర్లలో విలియమ్సన్ (28) సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ 18వ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. శ్రీలకంతో ఆరు టెస్టులు ఆడి 518 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉంది.