
డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ విలియమ్సన్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. 123 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 580 పరుగులు చేసింది . ఈ స్కోర్ వద్ద న్యూజిలాండ్ డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
కేన్ విలియమ్సన్ టెస్టులో ఆరు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అతను టెస్టుల్లో 8,000 పరుగులు పూర్తి చేసిన మొదటి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కూడా రికార్డును సృష్టించారు.
వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ స్కోరు 87/1 ఉన్నప్పుడు క్రీజులోకి విలియమ్సన్ వచ్చాడు.
విలియమ్సన్ మూడో వికెట్‌కు హెన్రీ నికోల్స్‌తో కలిసి ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు.
హెన్రీ నికోల్స్
డబుల్ సెంచరీతో మెరిసిన హెన్రీ నికోల్స్
విలియమ్సన్ టెస్టుల్లో డబుల్ సెంచరీల చేసి, మార్వన్ అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే టెస్టులో 7 డబుల్ సెంచరీలు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో హెన్రీ నికోల్స్ కూడా డబుల్ సెంచరీతో మెరిశాడు. 240 బంతుల్లో 200 పరుగులు చేసి కీవీస్ కి భారీ స్కోరును అందించాడు.
2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.