వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..?
భారత్ 267 పాయింట్లతో టీ20లో ప్రస్తుతం ఆగ్రస్థానంలో నిలిచింది. అలాగే వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. త్వరలోనే టీ20 సిరీస్ కూడా ఉంది. తరువాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. టెస్టులో ఆస్ట్రేలియా (126) పాయింట్లతో ఫస్ట్ స్థానంలో కొనసాగుతుండగా... భారత్ (115) పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వన్డే ర్యాకింగ్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ 3-0తో విజయం సాధిస్తే భారత్, వన్డేలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ వన్డేలో 117 పాయింట్లతో మొదట్లో నిలవగా.. భారత్ 110 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ సాధిస్తే మొదటి స్థానం
టెస్టులో ఆస్ట్రేలియా 126 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 115 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. టెస్టు ర్యాంక్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే ఆసీస్‌పై 2-0 తేడాతో భారత్ గెలవాలి. 2022లో మార్చిలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను 2-0తో భారత్ వైట్‌వాష్ చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది తొలి టెస్టు సిరీస్ విజయం. భారత్ స్వదేశంలో కేవలం ఒక టెస్టు సిరీస్ మాత్రమే ఆడింది. ఏడాది చివర్లో, బంగ్లాదేశ్‌ను భారత్ వారి దేశంలోనే ఓడించింది శ్రీలంకను 2-0తో ఓడించిన తర్వాత, స్వదేశంలో భారత్ వరుసగా 15వ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. భారత్ చివరి సారిగా ఫిబ్రవరి 2021లో స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిపోయింది.