Page Loader
టాప్ 4లోకి విరాట్ కోహ్లీ, టాప్ 3లోకి సిరాజ్
ఐసీసీ వన్డే ర్యాకింగ్‌లో నాలుగో స్థానానికి చేరుకున్న కోహ్లీ

టాప్ 4లోకి విరాట్ కోహ్లీ, టాప్ 3లోకి సిరాజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2023
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు సాధించారు. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల గ్యాప్‌లో మూడు సెంచరీలతో దుమ్మురేపాడు. సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డుకు కేవలం 3 సెంచరీల దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ.. బౌలర్ల ర్యాకింగ్‌లో బంగ్లాదేశ్ సిరీస్‌కి ముందు టాప్ 10లో లేని మహ్మద్ సిరాజ్.. తాజా మూడో వన్డేలో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్‌లో విరాట్‌ కోహ్లీ టాప్ 4, బౌలర్ల ర్యాకింగ్‌లో సిరాజ్ టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చారు.

విరాట్ కోహ్లీ

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన గిల్

బాబర్ అజామ్(887), వాన్ డెర్ డుసెన్ (766), క్వింటాన్ డికాక్ (887), విరాట్ కోహ్లీ (750) పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాకింగ్‌ను సాధించాడు. మూడు మ్యాచ్ లో తొమ్మిది వికెట్లు తీసి, 685 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ (730), ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ (727), సిరాజ్ కంటే ముందు ఉన్నారు. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సంపాదించాడు. 624 పాయింట్లతో ఏకంగా 26వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.