Page Loader
ప్రపంచకప్ ముందు ఆటగాళ్లకు గాయాలు.. వేగంగా కోలుకుంటారనే ధీమాలో క్రికెట్ దేశాలు
వేగంగా కోలుకుంటారనే ధీమాలో క్రికెట్ దేశాలు

ప్రపంచకప్ ముందు ఆటగాళ్లకు గాయాలు.. వేగంగా కోలుకుంటారనే ధీమాలో క్రికెట్ దేశాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచకప్‌ మెగాటోర్నీ అక్టోబర్‌ 5న భారత్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఆటకు ముందే పలు జట్లకు ఆటగాళ్ల గాయాలు, ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ - శ్రేయస్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్‌, న్యూజిలాండ్‌ - టిమ్‌ సౌథీ, విలియమ్సన్‌, దక్షిణాఫ్రికా - నోకియా, బవుమా బంగ్లాదేశ్‌ - నజ్మల్‌ శాంటో, ఎబాదత్, ఆస్ట్రేలియా - తమీమ్‌ ఇక్బాల్‌ కమిన్స్, స్మిత్, స్టార్క్, మ్యాక్స్‌వెల్, అగర్, ట్రేవిస్‌ హెడ్‌ పాకిస్థాన్‌ - నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్, సల్మాన్‌ అఘా, ఇమాముల్‌ హక్‌ ఇంగ్లాండ్‌ - ఆదిల్‌ రషీద్, మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్, జేసన్‌ రాయ్‌ శ్రీలంక - హసరంగ, తీక్షణ, చమీర, మదుశంక అన్ని జట్లలోనూ ఇలా కొంతమంది ఆటగాళ్లు గాయాలపాలయ్యారు.

details

టోర్నీకే దూరం కానున్న నసీమ్‌ షా, సౌథీ, ఎబాదత్, హెడ్‌

ఈ జాబితాలో కొందరు ప్రపంచకప్‌ నాటికి కోలుకోనున్నారు. నసీమ్‌ షా, సౌథీ, ఎబాదత్, హెడ్‌లు టోర్నీకే దూరం కానున్నారు. భారత ప్రపంచకప్‌ జట్టుపై ఎన్నో అంచనాలున్నాయి. అదే సమయంలో ఆటగాళ్ల గాయాలు టీమిండియాకు ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించేసిన వేళ ఆసియా కప్‌లోనూ అదే టీమ్ తో బరిలోకి దిగి గెలిచారు. ప్రస్తుతం శ్రేయస్‌ను వెన్ను నొప్పి మళ్లీ వెంటాడుతోంది. మరోవైపు అక్షర్‌ పటేల్‌కు గాయాలవడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఆటగాళ్ల గాయాల కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. తమ ఆటగాళ్లు వేగంగా కోలుకుంటారని అన్ని దేశాల బోర్డులు, సెలెక్టర్లు ధీమాతో ఉండటం గమనార్హం.