NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / SKY RESORTS : ప్రపంచంలోనే అత్యుత్తమ స్కైయింగ్ రిసార్టులు ఇవే
    తదుపరి వార్తా కథనం
    SKY RESORTS : ప్రపంచంలోనే అత్యుత్తమ స్కైయింగ్ రిసార్టులు ఇవే
    మంచు కురిసే దారుల్లో స్కైయింగ్ అడ్వెంచర్లకు మీరు సిద్ధమేనా

    SKY RESORTS : ప్రపంచంలోనే అత్యుత్తమ స్కైయింగ్ రిసార్టులు ఇవే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 27, 2023
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ స్కెయింగ్ అడ్వెంచర్ క్రీడలు బాగా ప్రసిద్ధి పొందాయి.

    ఈ మేరకు పలు శీతల ప్రాంతాలు అత్యంత అందమైన స్కీ రిసార్ట్‌లను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలోనే స్కీయింగ్ క్రీడలకు నిలయంగా పేరు గడించాయి.

    మంచుతో ఆటలు, స్కీయింగ్ నుంచి స్నోబోర్డింగ్ వరకు ఆడాలంటే వీటికి ప్రత్యేక ప్రదేశాలుంటాయి. ఆయా ప్రాంతాలన్నీ మంచుతో కప్పేసి ఉంటాయి. ఆయా అడ్వెంచర్లను మీరు ఎంజాయ్ చేయడానికి సిద్ధమా.

    మంచు పొరలపై గ్లైడింగ్ చేస్తే వచ్చే ఉల్లాసమే వేరు. ఎటుచూసినా ప‌చ్చ‌ని బైళ్లు, చెట్లు, ఉద్యానవనాలు, ఆకాశాన్నంటే పర్వత శిఖరాలుంటాయి.

    మంచు దుప్పటి కప్పుకున్న పచ్చిక బయళ్లు, హోయలొలికే మంచు పర్వాతాల్లోని పచ్చని ప్రకృతిలో స్కెయింగ్ అద్వితీయమైన అనుభూతికి నిదర్శనం.

    details

    మంచు కురిసే దారుల్లో స్కైయింగ్ అడ్వెంచర్లకు మీరు సిద్ధమేనా

    1. గార్మిష్-పార్టెన్‌ కిర్చెన్, జర్మనీ

    ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన స్కీ రిసార్ట్. గార్మిష్-పార్టెన్‌కిర్చెన్, బవేరియన్ దృశ్యాలతో ఉత్కంఠ భరితమైన క్షణాలను అందిస్తుంది.

    2. గ్రిండెల్వాల్డ్, స్విట్జర్లాండ్

    బెర్నీస్ ఒబెర్లాండ్ నడిబొడ్డున ఉన్న, గ్రిండెల్వాల్డ్ వద్ద ఎత్తైన ఉత్తర గోడ, అందమైన హిమానీనదంతో కప్పబడింది గ్రిండెల్వాల్డ్ రిసార్ట్. జంగ్‌ఫ్రావ్ క్రింద స్కీయింగ్ చేయవచ్చు.

    3. జాక్సన్ హోల్, USA

    దట్టమైన మంచు కుప్పకి జాక్సన్ హోల్ స్కై రిసార్టు నిదర్శనం. ఇక్కడి వాతావరణం స్కైయింగ్ కు అనువుగా ఉంటుంది.

    వన్యప్రాణుల సమూహం వద్ద సవాలు చేసే స్కీయింగ్‌ ఇక్కడ ఆహ్వానం పలుకుతుంది. టెటాన్ చైన్‌లోని టెటాన్ విలేజ్‌లోని ఈ అద్భుతమైన రిసార్ట్ బహుశా అత్యుత్తమ స్కైయింగ్ రిసార్ట్.

    details

    స్కీయర్‌లను వినోదభరితంగా ఆకట్టుకుంటున్న వెర్బియర్

    4. వెర్బియర్, స్విట్జర్లాండ్

    వాల్ డి బాగ్నెస్‌లో వెర్బియర్ పిస్టెస్ రిసార్ట్ చూసేందుకు సహజసిద్ధంగా కనిపిస్తుంది. ఇది చాలా పెద్దగా, నాలుగు లోయలతో కూడి ఉంటుంది. స్కీయర్‌లను వినోదభరితంగా ఆకట్టుకుంటుంది.

    5. టిగ్నెస్, ఫ్రాన్స్

    అత్యంత ప్రసిద్ధి చెందిన టిగ్నెస్ రిసార్టు, వాల్ డి'ఇసెర్ నీడలో దాగి ఉంటుంది. స్కైయింగ్ ఆటగాళ్లకు సవాలు చేసే రీతిలో కనిపిస్తుంటుంది.

    6. జెర్మాట్ మాటర్‌హార్న్, స్విట్జర్లాండ్

    యూరప్‌లోని అత్యంత ప్రసిద్ధ శిఖరం, మాటర్‌హార్న్. ఇక్కడ గ్రానైట్ ఏకశిలా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లే అందంగా కనిపిస్తుంది.

    7. విస్లర్ మౌంటైన్, కెనడా

    1965లో ఈ రిసార్టుకు విస్లర్ మౌంటైన్‌గా పేరు మార్చారు. ఆహ్లాదకరమైన ఫ్రీ విలేజ్ కేంద్రంలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

    DETAILS

    అక్కడ సాహసం సహా హోటళ్లు, నాణ్యమైన మద్యం, టేస్టీగా ఆహారం

    8. మోంట్ ట్రెంబ్లాంట్, కెనడా

    కెనడాలోనే నెలవున్న మరో స్కైయింగ్ రిసార్టు మోంట్ ట్రెంబ్లాంట్. లారెన్షియన్ పర్వత శ్రేణిలో మాంట్రియల్‌కు ఉత్తరాన గంట దూరంలో ఉన్న మోంట్ ట్రెంబ్లాంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఇట్టే ఆకర్షి,స్తోంది.

    విలాసవంతమైన హోటళ్లు, నాణ్యమైన మద్యం, టేస్టీగా ఆహారంతో పాటు సాహసం సైతం కలగలసి ఉంటుంది.

    9. చమోనిక్స్, ఫ్రాన్స్

    ఆల్ప్స్‌లోని ఎత్తైన పర్వతమైన మోంట్ బ్లాంక్ వద్ద ఈ స్కైయింగ్ రిసార్టు ఏర్పాటైంది. మెర్ డి గ్లేస్‌లో అతిపెద్ద హిమానీనదాల వద్ద, యూరప్ ఖండంలోనే రెండో అతి పొడవైన హిమానీనదంగా చమోనిక్స్‌ పేరు పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025