LOADING...
Hardik Pandya: ముంబై కెప్టెన్ ఏమయ్యాడు?
ముంబై కెప్టెన్ ఏమయ్యాడు?

Hardik Pandya: ముంబై కెప్టెన్ ఏమయ్యాడు?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 04, 2026
06:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌కు ముంబై జట్టుకు కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌కు దూరమవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన గైర్హాజరీకి సంబంధించిన పూర్తి వివరాలు జట్టు యాజమాన్యం ఇంకా వెల్లడించకపోయినా, స్వల్ప గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించే పాండ్య లేకపోవడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముంది.స

వివరాలు

సూర్యకుమార్ నాయకత్వంలో మ్యాచ్..

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎనిమిదో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. టాస్‌కు ముందు ముంబై మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించడంతో మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. భారత జట్టుతో పాటు ముంబైకి కూడా గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం సూర్యకు ఉంది. మైదానంలో చురుకుదనం, సమయోచిత నిర్ణయాలతో గుర్తింపు పొందిన అతను, ఢిల్లీపై ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య నాయకత్వంలో ముంబై జట్టు విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement