India vs Pakistan: జూన్ 14న హై వోల్టేజ్ మ్యాచ్.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. భారత్ తన ఆరంభ మ్యాచ్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. టోర్నీ ఫైనల్ జులై 5న లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగనుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి.
Details
రెండు గ్రూపులుగా విభజన
టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్. గ్రూప్-2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్. ఇలా ప్రపంచంలోని అగ్ర జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.