కోనేరు హంపి ఆట ఆదుర్స్
ప్రపంచ బ్లిట్జ్ లో కోనేరు హంపి చరిత్రను బద్దలు కొట్టింది. 9రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉంది. ఇంకె ఆమె పతకం సాధించదని అందరూ ఓ అంచనాకు వచ్చారు. అయితే అంచనాలను తలకిందులు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫామ్ ఉన్న అమ్మాయిలను వెనక్కి నెట్టి ప్రపంచ బ్లిట్జ్ టోర్నలో పతకం సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్రను తిరగరాసింది. హంపి రెండో రోజు జరిగిన ఎనిమిది గేముల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు గేముల్లో గెలవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో గేమ్‌ను 'డ్రా' చేసుకొని 44వ స్థానం నుంచి ఏకంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది.
తల్లి అయిన పునరాగమనం.. అనంతరం రికార్డు బద్దలు
17 రౌండ్లలో 12.5 పాయింట్లతో హంపి ద్వితీయ స్థానంలో నిలిచింది. చివరి 12 రౌండ్లలో ఒక్క అపజయం లేకుండా ఆడి అదరహో అనిపించింది. ఈ క్రమంలో ఈ టోర్నీలో ఆధిక్యంలో ఉన్న షవ్లోనాను 16వ రౌండ్లో ఓడించిన ఈ గ్రాండ్‌మాస్టర్.. చివరి రౌండ్లో తనకన్నా మెరుగైన రేటింగ్ ఉన్న టాన్ జాంగ్‌యీపై గెలిచి రజతం గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అసుబెయెవా (కజకిస్థాన్) పసిడి గెలిచింది. ఆనంద్ (2017) తర్వాత ఈ టోర్నీలో పతకం సాధించిన ఘనత హంపిదే కావడం గమనార్హం. 2017లో తల్లి హంపీ తల్లి అయింది. అనంతరం పునరాగమనం చేసిన హంపి 2019లో ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో స్వర్ణంతో సత్తా చాటింది.